ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సీఎం జగన్ (AP CM YS Jagan) గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే బైజూస్ (BYJU'S) సంస్థలో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల్లో డిజిటల్ లెర్నింగ్ స్కిల్స్ పెంచే విధంగా తీసుకోబోతున్న చర్యల గురించి సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి నుంచి ప్రతి విద్యార్థిలకి ట్యాబ్ ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. సెప్టెంబరు నాటికల్లా.. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాడి మొత్తం 4,70,000 మంది పిలల్లు 8వ తరగతిలోకి అడుగుపెడుతున్నారని.. వీరందరికీ ట్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.
ఈ ట్యాబ్స్ ద్వారా డిజిటిల్ పద్ధతుల్లో చదువులు సునాయసంగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. 8వ తరగతి పిల్లలు 9వ తరగతిలోకి వెళ్లేసరికి 9వ తరగతికి సంబంధించి పాఠాలకు సంబంధించిన కంటెంట్ డౌన్లోడ్ అవుతుందని.., మళ్లీ వీళ్లు 10వ తరగతికి వచ్చే సరికి.. 10వ తరగతికి పాఠాలకు సంబంధించిన కంటెంట్‌ను ట్యాబ్‌లో డౌన్లోడ్ చేస్తారన్నారు.
ప్రభుత్వం స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ విద్యను అభ్యసిస్తున్న పిల్లలు దాదాపు 32 లక్షలమంది ఉన్నారు. బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం కారణంగా వీరందరికీ లెర్నింగ్ యాప్‌ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది. 2025 నాటి పదోతరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాస్తారు. వీరిని సన్నద్ధంచేసేందకు వీలుగా ఈ యాప్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. (ప్రతీకాత్మకచిత్రం)
బైజూస్‌లో లెర్నింగ్‌యాప్‌లో బోధన అంతా అత్యంత నాణ్యంగా ఉంటుంది. యానిమేషన్ ద్వారా, బొమ్మల ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా, క్షుణ్నంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టులన్నీకూడా ఇటు ఇంగ్లిషులోనూ, ఇటు తెలుగు మాధ్యంలోనూ కూడా అందుబాటులో ఉంటాయి. ద్విభాషల్లో పాఠ్యాంశాలు ఉండడం వల్ల పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు, భాషాపరమైన ఆటంకాలు లేకుండా విషయాన్ని అర్థంచేసుకోవడానికి ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంల్ల వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టతతో, నాణ్యతతో ఉంటాయి. విద్యార్థులు ఎంతవరకూ నేర్చకున్నారన్నదానిపై ప్రతి ఒక్కరికీ కూడా ఫీడ్ బ్యాక్ పంపుతారు. 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్ధంచేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్ గేమ్స్ కూడా యాప్ లో ఉంటాయి. ఏ తరహా పరిజ్ఞానం ఉన్న విద్యార్థి అయినా యాప్‌ద్వారా సులభంగా పాఠాలు నేర్చుకోవచ్చు. (File)
ఐతే ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్స్ ను విడిగా ఇస్తారా లేక అమ్మఒడి పథకంతో లింక్ చేస్తారా అనేది మాత్రం స్పష్టతనివ్వలేదు. ఇప్పటికే అమ్మఒడి కింద డబ్బులు వద్దంటే ల్యాప్ టాప్ లు అందిస్తోంది. ఐతే ఈ పథకం కేవలం 9 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నవారికే వర్తిస్తుంది. ఇప్పుడు 8వ తరగతిలోనే ట్యాబ్స్ ఇస్తుండటంతో 9వ తరగతి నుంచి ల్యాప్ టాప్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. (File)