ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత కేవలం 5 నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.
2/ 13
సుదీర్ఘ పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు, బాధలు స్వయంగా చూశానని జగన్ అన్నారు.
3/ 13
అందుకే ఆ సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారందరికీ న్యాయం చేసే విధంగా రూ.264 కోట్లు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
4/ 13
దీని ద్వారా దాదాపు 3.70 లక్షల డిపాజిటర్లకు మేలు జరుగుతుందన్నారు.
5/ 13
అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి కూడా త్వరలో న్యాయం చేస్తామన్నారు.
6/ 13
అగ్రిగోల్డ్ బాధితుల్లో ఇంకా ఎవరైనా తమ పేర్లు నమోదు చేసుకోకపోతే, వారికి మరో నెల అవకాశం ఇస్తున్నామని సీఎం వెల్లడించారు.
7/ 13
కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారికి కూడా వచ్చే నెలలో చెల్లిస్తామని చెప్పారు.
8/ 13
ఇచ్చిన మాట ప్రకారం రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపు కార్యక్రమం గురువారం ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభమైంది.
9/ 13
గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం లాంఛనంగా కంప్యూటర్ బటన్ నొక్కడంతో బాధితుల ఖాతాల్లోకి నగదు జమ అయింది.
10/ 13
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని విపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్, అనతి కాలంలోనే ఆ మాట నిలబెట్టుకున్నారు.
11/ 13
అగ్రిగోల్డ్ సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించే విధంగా గత నెల 18న రూ.263.99 కోట్లు విడుదలకు ఉత్వర్వులు జారీ చేశారు.
12/ 13
దీంతో రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 3,69,655 మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఊరట లభించింది.
13/ 13
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించేలా తొలి బడ్జెట్లోనే రూ.1,150 కోట్లు కేటాయించారు.