గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ వారికి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి అభినందించారు.
2/ 5
గత ఏడాది అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. కార్యదర్శుల నియామకం చేపట్టి ఈ వ్యవస్థను జనవరి 26న పూర్తి స్థాయిలో ప్రారంభించారు.
3/ 5
కరోనా సంక్షోభ సమయంతో పాటు ప్రతికూల వాతావరణంలోనూ లబ్దిదారులకు సేవలు అందించిన వాలంటీర్లకు సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
4/ 5
ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలు, వార్డుల్లోనే పొందేలా వెసులుబాటు వచ్చిందని... ప్రభుత్వ పథకాలు సైతం వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే దరిచేరుతున్నాయని వైసీపీ నేతలు, మంత్రులు చెబుతున్నారు.
5/ 5
ఈ కార్యక్రమంలో ఏపీ సీఎస్ నీలం సాహ్ని, మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చప్పట్లతో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటర్లకు అభినందనలు తెలిపారు.