ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రతి రైతుకు పండించిన పంటకు సంబంధించి ప్రతి రూపాయి అందేవిధంగా సీఎం జగన్ (AP CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ (November) మొదటి వారం నుంచి రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు తప్పకుండా రైతులకు గిట్టుబాటు ధర కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంటకు ఈ క్రాపింగ్ చేయడం వల్ల ఏ రైతు ఏ పంట వేస్తున్నారనే అంచనా దాదాపుగా పూర్తయింది. దీంతో ఈ నెల 15 వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికి డిజిటల్, ఫిజికల్ రశీదులివ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. (ఫైల్)
అంతేకాదు గన్నీ బ్యాగులు, కూలీలు, రవాణా సదుపాయాలను సైతం అవసరమైన మేరకు సమకూర్చుకోవాలన్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలపైనా మార్కెటింగ్ విషయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)