Ration Door Delivery: రేషన్ బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకోవాలంటే ఇక నుంచి రేషన్ షాపునకు వెళ్లాల్సిన అవసరం లేదు. రేషన్ సరుకులే మీ ఇంటికే వస్తాయి. నాణ్యమైన బియ్యాన్ని ఇంటి వద్దకే సరఫరా చేసే వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ చిత్రాలను ఇక్కడ చూడండి.