ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నందున కేవలం 48 గంటల్లో ఒమిక్రాన్ తగ్గిస్తానంటూ గతంలో ఆనందయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఫైల్)
ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రారంభదశలో ఉన్న సమయంలో తన దగ్గర ఒమిక్రాన్ మందు ఉందని.. ఈ మందుతో రెండు రోజుల్లో నయం చేస్తామని ఆనందయ్య ప్రకటించారు. ఎంతమందికైనా మందును సరఫరా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఐతే ఆనందయ్య ప్రకటనపై అప్పట్లోనే ఆయుష్ శాఖ స్పందించింది. ఒమిక్రాన్ కు ఆయుర్వేద మందు పేరుతో తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని స్పష్టం చేసింది. (ఫైల్)
ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య మందు బాగా పాపులర్ అయింది. ఆరోగ్యం విషమంగా ఉన్నవారిని కూడా బ్రతికిస్తుందంటూ ప్రచారం జరుగడంతో తెలుగురాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారు కూడా కృష్ణపట్నంకు పోటెత్తారు. ఆ తర్వాత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆనందయ్య మందును రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేశారు. (ఆనందయ్య మందు ఫైల్ ఫోటో)