Ap Government: ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవి విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2/ 6
ప్రస్తుతం 60 ఏళ్లకు ఉన్న పదవి ఉద్యోగ విమరణను 62 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టం 1982 సవరణ బిల్లును ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
3/ 6
అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల చట్టం 1962 సవరణ బిల్లు ద్వారా జిల్లా గ్రంధాలయ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ కూడా 62 ఏళ్లకు పెంచే విదంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు.
4/ 6
2022 జనవరి 1 నుండి 2022 నవంబర్ 29 వరకు మధ్య 60 ఏళ్లు నిండి సర్వీస్ నుంచి పదవి విరమణ పొందిన గ్రంధాలయ సంస్థ ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
5/ 6
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బోధన, బోధనేతర సిబ్బంది, గ్రంధాలయ సంస్థ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
6/ 6
ఎయిడెడ్ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవి విరమణ వయస్సు పెంపుకై 1982 సవరణ బిల్లు, గ్రంధాలయ సంస్థల ఉద్యోగుల కోసం 1962 సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు.