Rain Alert: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్
Rain Alert: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి వానలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా వాతారణ శాఖ వెదర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)

2/ 4
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
ఈ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)