తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.11 లక్షల విలువైన ముత్యాల కవచాన్ని బహూరించాడు. తన వివరాలు బయటపెట్టకుండా తిరుమల పెద్ద జీయర్ స్వామికి ముత్యాల కవచాన్ని అందించాడు. శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు సమక్షంలో వాటిని టీటీడీకి అందజేశారు.