ఆంధ్రప్రదేశ్లో ఇసుక వినియోగదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది.
2/ 8
పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు ఇచ్చింది.
3/ 8
ఇప్పటి వరకు ట్రాక్టర్ ఇసుకకు చలానాగా రూ.1,300లు, లోడింగ్ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1,000 నుంచి రూ.1,500లు కలుపుకొని మొత్తం రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేసేవారు.
4/ 8
ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్కు రూ.1,300 భారం తగ్గనుంది.
5/ 8
ఇసుక కోసం వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్–1లో దరఖాస్తు చేసుకోవాలి.
6/ 8
ప్రతి వ్యక్తి అర్జీని 24 గంటల్లో పరిశీలించి అనెక్సర్–2లో పర్మిట్(సమయం, తేదీలతో)ను ఇస్తారు. రీచ్ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు.
7/ 8
రవాణా చేసుకునే సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్ కచ్చితంగా ఉండాలి. నోటిఫై చేసిన రీచ్ల నుంచి మాత్రమే ఇసుక తరలించాలి.
8/ 8
ఇసుక పక్కదారి పట్టకుండా గ్రామ కార్యదర్శి పర్యవేక్షించాలి.