ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,882 టెస్టులు నిర్వహించగా... 4,108 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1,018, చిత్తూరు జిల్లాలో 1,004, పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే వందలోపు కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మకచిత్రం)
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 162, చిత్తూరు జిల్లాలో 1,004, తూర్పుగోదావరి జిల్లాలో 263, గుంటూరు జిల్లాలో 345, కడప జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 170, కర్నూలు జిల్లాలో 85, నెల్లూరు జిల్లాలో 261, ప్రకాశం జిల్లాలో 176, శ్రీకాకుళం జిల్లాలో 114, విశాఖపట్నం జిల్లాలో 1,018, విజయనగరం జిల్లాలో 169, పశ్చిమ గోదావరి జిల్లాలో 46 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ప్రభుత్వం తాజాగా నిర్వహించిన 22,882 టెస్టులతో కలిపి ఇప్పటివరకు 3,18,84,914 టెస్టులు నిర్వహించింది. ఇటీవల రోజుకు 20 నుంచి 30వేల టెస్టులను మాత్రమే నిర్వహించిన ప్రభుత్వం.. థర్డ్ వేవ్ నేపథ్యంలో 40వేలకు పైగా టెస్టులు చేస్తోంది. నిన్న ఆదివారం కావడంతో టెస్టుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)