ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,954 టెస్టులు నిర్వహించగా... 3,205 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 695, చిత్తూరు జిల్లాలో 607 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు జిల్లాల్లో 200 కంటే అధికంగా కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మకచిత్రం)
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 160, చిత్తూరు జిల్లాలో 607, తూర్పుగోదావరి జిల్లాలో 274, గుంటూరు జిల్లాలో 224, కడప జిల్లాలో 42, కృష్ణాజిల్లాలో 217, కర్నూలు జిల్లాలో 123, నెల్లూరు జిల్లాలో 203, ప్రకాశం జిల్లాలో 90, శ్రీకాకుళం జిల్లాలో 268, విశాఖపట్నం జిల్లాలో 695, విజయనగరం జిల్లాలో 212, పశ్చిమ గోదావరి జిల్లాలో 90 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.