ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,266 టెస్టులు నిర్వహించగా... 14,502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1,728, అనంతపురం జిల్లాలో 1,610 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో 400 కంటే అధికంగానే కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మకచిత్రం)
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 1,610, చిత్తూరు జిల్లాలో 685, తూర్పుగోదావరి జిల్లాలో 941, గుంటూరు జిల్లాలో 846, కడప జిల్లాలో 1,492, కృష్ణా జిల్లాలో 484, కర్నూలు జిల్లాలో 1,551, నెల్లూరు జిల్లాలో 1,198, ప్రకాశం జిల్లాలో 1,597, శ్రీకాకుళం జిల్లాలో 865, విశాఖపట్నం జిల్లాలో 1,728, విజయనగరం జిల్లాలో 862, పశ్చిమ గోదావరి జిల్లాలో 643 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,800 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ సంఖ్య 93,305కి పెరిగింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 16,424, చిత్తూరు జిల్లాలో 10,728 యాక్టివ్ కేసులుండగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 2,246 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)