ANDHRA PRADESH POLITICAL NEWS JANASEAN CHIEF PAWAN KALYAN REACHED RAJAMUNDRY HE ATTENDT FISHERMAN MEET NGS
Pawan Kalyan: రాజమండ్రిలో పవన్ ఫ్యాన్స్ హంగామా.. జనసైనికుల ఘన స్వాగతం
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సమర శంఖం పూరించేందుకు పవన్ సిద్ధమయ్యారు. మత్స్యకారుల సమస్యలపై భారీ బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. జనసేన అవిర్భావ దినోత్సవాల్లో సందర్భంగా రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాటినికి పవన్ సిద్ధమయ్యారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారుల తరపున పోరాటానికి సిద్ధమయ్యారు. కాసేపట్లో నర్సాపురం వేదికగా మత్స్యకార సభ లో పాల్గోనున్న ఆయన.. ప్రభుత్వానికి అక్కడ నుంచే హెచ్చరిక జారీ చేయనున్నారు.
2/ 6
నర్సాపురం సభకు హాజరయ్యేందుకు ముందుగా హైదరాబాద్ లో బయలుదేరిన ఆయన రాజమండ్రికి చేరుకున్నారు.. దీంతో అక్కడ జనసైనికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
3/ 6
పవన్ ను చూసేందుకు భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. కాబోయే సీఎం పవన్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. అభిమానుల ఆనందాల మధ్యే భారీ ర్యాలీతో నర్సాపురం బయలుదేరారు పవన్.
4/ 6
కాసేపట్లో పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) నరసాపురం (Narasapuram) కు ఆయన చేరుకోనున్నారు. పవన్ వస్తుండడంతో .. పార్టీ నేతలు సభకు భారీ ఏర్పాట్లు చేశారు. అక్కడ జరిగే మత్స్యకార మహాసభకు ఆయన హాజరుకానున్నారు.
5/ 6
స్థానిక మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ గళమెత్తనున్నారు. ముఖ్యంగా అధికారంలోకి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీయనున్నారు.
6/ 6
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార వర్గం ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనంతో ఉంది. దీంతో వారి తరపున పోరాడేందుకు జనసేన సిద్ధమైంది. మత్స్యకారులకు అండగా ఉంటామని సభ వేదికగా పవన్ వారికి హామీ ఇవ్వనున్నారు.