తాజాగా నమోదైన కేసులకు సంబంధించి వారికి కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. అందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ జీనోమ్ టెస్టింగ్కు పంపించారు. అయితే ఇప్పటికే మరికొందరి శాంపిల్స్ రావాల్సి ఉంది. దీంతో ఒమిక్రాన్ కేసులు మరికొన్ని నమోదయ్యే అవకాశం ఉంది.