2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కలిగేలా చేసింది. అప్పటి నుంచి ఆ కాజా రుచి ఒక్కసారి చూస్తే.. మరల మరల తినాలనిపించేలా నోరు ఊరిస్తుంది. అంతటి ఘనమైన కాజాకు అరుదైన గుర్తింపు లభించడంపై.. గోదావరి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ గొట్టం కాజాతో పాటు విశాఖ జిల్లాకు చెందిన మాడుగుల హల్వా కు విశిష్ట స్థానం కల్పించింది భారతీయ పోస్టల్ శాఖ. మాడుగుల వేదికగా 1890లో తొలిసారి ఈ హల్వాను తయారు చేశారు. ఈ హల్వాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గోధుమపాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి పదార్ధాలతో రుచికరమైన హల్వాను తయారు చేస్తారు.