ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం టామాట ధరలు (Tomato Price) మండిపోతున్నాయి. చూస్తుండగానే కిలో టమాటా వందకు చేరువైంది. దీంతో టామాట పేరెత్తడానికే జనం భయపడే పరిస్థితి వచ్చింది. దిగుబడులు తగ్గడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కూడా లేకపోవడంతో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. (ప్రతీకాత్మకచిత్రం)
బహిరంగ మార్కెట్ లో టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గిన నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల నుండి టమాటాను దిగుమతి చేసుకుని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడంపై ప్రభుత్వం తీవ్ర్రంగా పరిగణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైతు బజార్ల సి.ఇ.ఓ.కు కూడా ఆదేశాలు జారీచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిని ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 20 నుండి రైతు బజార్లలో సరసమైన ధరలకే విక్రయిస్తున్న టమాటాలను కొనుగోలు చేసుకోవాలని వినియోగదారులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)