ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. నెలవారీగా సంక్షేమ పథకాల పేరుతో ఆర్ధికసాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఎకౌంట్లలో జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ఆర్ధిక సంవత్సరంలో రైతు భరోసా, కాపునేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, అగ్రిగోల్డ్ బాధితులకు సాయం కింద నగదు జమచేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద రుణమాఫీ కింద నగదు జమచేయనుంది. 2019 ఏప్రిల్ నాటికి డ్వాక్రా మహిళలు చెల్లించాల్సిన రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన మేరకు నాలుగు విడతల్లో చెల్లిస్తోంది. ఇప్పటికే ఒక ఏడాదికి సంబంధించిన నగదును ప్రభుత్వం జమ సింది. (ప్రతీకాత్మకచిత్రం)