ANDHRA PRADESH GOVERNMENT TO CONDUCT DEPARTMENTAL TEST TO GRAM WARD SECRETERIATE EMPLOYEES FULL DETAILS HERE PRN
AP Govt Jobs: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్... జాబ్ పర్మినెంట్ కావాలంటే ఈ పరీక్షలు పాసవ్వాల్సిందే...!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andha Pradesh Government) రెండేళ్ల క్రిందట రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. త్వరలోనే ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల క్రిందట రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. వాటిల్లో 1.34 లక్షల మందిని ఉద్యోగులుగా నియమించింది.
2/ 7
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,004 సచివాలయాల్లో వీరంతా పనిచస్తున్నారు. రెండేళ్ల ప్రొబెషన్ అనంతరం వీరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
3/ 7
మరో మూడు నెలల్లో వీరాంత రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రొబేషన్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రెండు దశల్లో పరీక్షలు నిర్వహించనుంది. వీటిలో ఉత్తీర్ణులైతేనే ప్రొబేషన్ ఖరారు చేస్తారు.
4/ 7
ముఖ్యంగా డిజిటల్ సేవలు, నాయకత్వ లక్షణాలు, సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివాటిపై తొలి దశలో 35 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం శాఖాపరమైన అంశాలు, ప్రభుత్వ పథకాల వంటి అంశాలపై 65 మార్కులతో మరో పరీక్ష నిర్వహిస్తారు.
5/ 7
ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే శాశ్వత ఉద్యోగానికి పరిగణలో తీసుకుంటారు. ఉత్తీర్ణత సాధించని వారికి శిక్షణ ఇచ్చి మరో అవకాశం కల్పిస్తారు.
6/ 7
ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వర్చువల్ విధానంలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15 వరకు ఈ ట్రైనింగ్ ఉంటుంది.
7/ 7
ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తారు. ఎగ్జామ్స్ ఎప్పుడనేది త్వరనే తేదీలు ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు.