ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను (AP Welfare Schemes) అమలు చేస్తోంది. అన్ని పథకాలకు కొన్ని రూల్స్ ను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలు లోబడి ఉన్న కుటుంబాలకు పెన్షన్లు, అమ్మఒడి, ఆసరా, కాపునేస్తం, రైతు భరోసా వంటి పథకాలను అందిస్తోంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
పాస్టర్లకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే నిబంధనల కారణంగా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చర్చి ఉన్న స్థలం చర్చిపేరిట రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్న నిబంధనతో దరఖాస్తు కూడా చేయడం లేదు. దీంతో ప్రభుత్వం పలుసార్లు గడువు పొడిగించింది. మరోసారి గడువును ఈనెల 25వరకు పొడిగించింది. (ప్రతీకాత్మకచిత్రం)
స్థలం చర్చిపేరు మీదు రిజిస్టర్ అయి ఉండాలన్న నిబంధనను కొనసాగిస్తూనే తహసీల్దార్ జారీ చేసిన పొజిషన్ సర్టిఫికేట్ లేదా దాతలు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ వంటివి ఉన్నా చాలని పేర్కొంది. ఇప్పుడు ఈ నిబంధనను మరింత సడలించి వీఆర్వో, గ్రామ సచివాలయంలో వెల్ ఫేర్ అసిస్టెంట్ జారీ చేసిన ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. (ప్రతీకాత్మకచిత్రం)