విద్యాసంవత్సవరం మొదలు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు ఫీజులు ఖరారు చేసింది. ప్రైమరీ స్కూళ్లు, హై స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ప్రాంతాల వారీగా నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫీజుల వివరాలు ప్రకటించింది. గ్రామ పంచాయతీల పరిధిలోని స్కూళ్లలో ప్రైమరీ విద్యకు రూ.10వేలు, హైస్కూల్ విద్యకు రూ.12వేలుగా నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
మున్సిపాలిటీల పరిధిలోని ప్రైమరీ విద్యకు రూ.11వేలు, హై స్కూల్ విద్యకు రూ.15,000గా నిర్ణయించిన ప్రభుత్వం కార్పొరేషన్ల పరిధిలో ప్రైమరీ విద్యకు రూ.12,000, హై స్కూర్ విద్యకు రూ.18వేలుగా ఖరారు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఇక జూనియర్ కాలేజీల్లోనూ ఫీజుల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీల పరిధిలోని కాలేజీల్లో MPC, Bi,PC కోర్సులకు రూ.15వేలు, ఇతర గ్రూపులకు రూ.12వేలుగా నిర్ణయించనింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
అలాగే మున్సిపాలిటీల్లోని కాలేజీల్లో MPC, Bi.PC కోర్సులకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15వేలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీల్లో MPC, Bi.PC కోర్సులకు రూ.20వేలు, ఇతర గ్రూపులకు రూ.18వేలుగా నిర్ణయించింది.(ప్రతీకాత్మకచిత్రం)