ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జూలై 5 నంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్న (AP Schools reopen) సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. జూలై 5 నుంచి 2023 ఏప్రిల్ 29వరకు విద్యా సంవత్సరంగా నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 220 రోజుల పాటు స్కూళ్లు పనిచేయనున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ఇక ప్రీ ప్రైమరి, 1,2 తరగతులుండే ఫౌండేషన్ స్కూళ్లు, 1-5 తరగతుల ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 3.30 వరకు క్లాసులుంటాయి. ఆ తర్వాత అరగంట పాటు ఆప్షనల్ గా స్పోర్ట్స్, రివిజన్ క్లాస్ ఉంటుంది. ప్రీ హైస్కూల్, హైస్కూల్, హై స్కూల్ ప్లస్ స్కూళ్లు 9-4 గంటల వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత గంట స్పోర్ట్స్, రివిజన్ క్లాసులుంటాయి. వారంలో ఒకరోజు నో బ్యాగ్ డే ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
సెలవుల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు అంటే 11 రోజుల పాటు సెలవులుంటాయి. అదే క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు అక్టోబర్ 1 నుంచి 6వరకు దసరా సెలవులుంటాయి. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 80 రోజులు సెలవులు రానున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
పరీక్షల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 7-9 వరకు ఫార్మెటివ్-1, అక్టోబర్ 13-15 తేదీల్లో ఫార్మెటివ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇక నవంబర్ 21-30 వరకు సమ్మెటివ్-1, జనవరి 19-31 వరకు ఫార్మెటివ్-3, ఫిబ్రవరి 6-8 నుంచి ఫార్మెటివ్-4 పరీక్షలుంటాయి. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్, 1-9 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 13 నుంచి 27 వరకు ఉంటాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే ప్రతి ఏడాది జూన్ 12న విద్యాసంవంత్సరం ఆరంభమయ్యేది. కరోనా కారణంగా గత ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యం కావడంతో మే 5వరకు స్కూళ్లు కొనసగాయి... రెండు నెలల సమ్మర్ హాలిడేస్ అనంతరం జూలై 5న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఐతే ఈనెల 28 నుంచే టీచర్లకు స్కూళ్లకు వెళ్లి అక్కడి సౌకర్యాలు, శుభ్రం చేయించడం వండి పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. (ప్రతీకాత్మకచిత్రం)