గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ జీవో విడుదల చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకొని పరీక్ష పాసైన వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 5 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
2019 అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఉద్యోగాలకు ఎంపికన వారందరికీ రెండేళ్లపాటు ప్రొబేషన్ ఉంటుందని అప్పట్లోనే ప్రభుత్వం తెలిపింది. ఈ రెండేళ్లు నెలకు రూ.15వేల చొప్పున జీతాన్ని ఖరారు చేసింది. వీరిలో 2021 అక్టోబర్ 2 నాటికి 40వేల మంది, 2021 అక్టోబర్ 30నాటికి 30వేల మంది, 2021 నవంబర్ నెలాఖరుకు 50వేల మంది రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయింది. (ప్రతీకాత్మకచిత్రం)