Beautifull Beach: సాగర తీరం మరింత సుందరం.. రాష్ట్రంలో 9 బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికేషన్‌ సాధనే లక్ష్యం

Andhra Pradesh Beaches: బీచ్ ఈ పేరు వింటేనే చాలు మనసు గాలిలో తేలిపోతుంది. అలల సవ్వడి దగ్గరుండి చూడాలని మనసు ఆరాటపడుతోంది. అయితే ప్రపంచ స్థాయి ప్రతిష్ఠాత్మక స్వచ్ఛంద అవార్డుల్లో ఒకటైన "బ్లూ ఫ్లాగ్" అవార్డులను ఉత్తమ బీచ్‌లకు అందజేస్తారు. బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్ చేజిక్కించుకోవాలంటే బీచ్‌లు చాలా పరిశుభ్రంగా.. సర్వాంగ సుందరంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లోని 9 బీచ్ లను ఆ స్థాయిలో తీర్చి దిద్దడంపై ప్రభుత్వం ఆశిస్తోంది.