AP Movie Ticket Price: ఏపీలో సినిమా టికెట్ల కొత్త ధరలు ఇవే..! ఏ ప్రాంతంలో ఎంతంటే..!
AP Movie Ticket Price: ఏపీలో సినిమా టికెట్ల కొత్త ధరలు ఇవే..! ఏ ప్రాంతంలో ఎంతంటే..!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్లకు (Movie Tickets Price) సంబంధించిన కొత్త ధరలను ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ల ధరలను ఫిక్స్ చేసిన ప్రభుత్వం.., బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీ చట్టసవరణను అసెంబ్లీ ఆమోదించింది. ఇకపై ఇష్టానుసారం టికెట్ రేట్లను పెంచడానికి వీల్లేదని.. అలాగే అదనపు షోలకు కూడా అనమతిచ్చేది లేదని స్పష్టం చేసింది.
2/ 7
ఈ క్రమంలో రాష్ట్రంలో సినిమా టికెట్లకు సంబంధించిన కొత్త ధరలను ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ల ధరలను ఫిక్స్ చేసిన ప్రభుత్వం.., బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది.
3/ 7
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను నిర్ణయించింది. ఈ మేరకు ధరలను విడుదల చేసింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు నిర్ణయించింది.