Chinthamani Natakam: నాటక ప్రియులకు ఏపీ ప్రభుత్వం షాక్... ఇకపై ఆమె కనిపిస్తే చర్యలు తప్పవు
Chinthamani Natakam: నాటక ప్రియులకు ఏపీ ప్రభుత్వం షాక్... ఇకపై ఆమె కనిపిస్తే చర్యలు తప్పవు
నాటక ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని (Andhra Pradesh) ఉర్రూతలూగించిన చింతామణి నాటకంపై (Chinthamani Natakam) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) నిషేధం విధించింది.
హైదరాబాద్ ఆర్యవైశ్య మహాసభ విజ్ఞప్తి మేరకు చింతామణిని బ్యాన్ చేస్తున్నట్లు సీఎంఓ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఆదేశాలిచ్చింది.
2/ 6
తెలుగు నాటక రంగంలో చింతామణికి ప్రత్యేక స్థానం ఉంది. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది.
3/ 6
తెలుగు నాటక రంగంలో చింతామణికి ప్రత్యేక స్థానం ఉంది. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది.
4/ 6
ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, భవానీ శంకరం, శ్రీహరి.
5/ 6
నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర.. చింతామణి అనే స్త్రీ వ్యామోహంలో ఆస్తినంతా పొగొట్టుకుంటుంది. అలాంటి పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆర్యవైశ్యులు ఆరోపిస్తున్నారు.
6/ 6
చింతామణి నాటకాన్ని తొలిసారిగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రామ్మోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు.