Night Curfew in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా వైరస్ భయపెడుతోంది. ముఖ్యంగా రెండు జిల్లాల్లో పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మళ్లీ పాత పరిస్థితులను గుర్తుకు తెస్తోంది. ఏపీ వ్యాప్తంగా కూడా కేసులు పెరిగే అవకాశం ఉండడంతో మరోసారి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది..
ఏపీ లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలపై ఫోకస్ చేసింది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో రాత్రి 11.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు.
వీటితో పాటు దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని.. పండుగ సమయం కాబట్టి మరింత జాగ్రత్తగా అధికారులు ఉండాలి అన్నారు.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని సూచించారు..