Andhra Pradesh Corona cases Update: ఆంధ్రప్రదేశ్ లో కరోనా జెట్ స్పీడ్ వేగంతో దూసుకు వస్తోంది. సెకెండ్ వేవ్ తో పోలిస్తే కేసులు మూడు రెట్ల పెరుగుల కనిపిస్తోంది. రోజు వారి కేసుల సంఖ్య వంద నుంచి పది వేల మార్కు చేరుకోవడానికి కనీసం పది రోజుల గ్యాప్ కూడా లేదు.. ఇప్పటికే 24 గంటల్లో నమోదైన కేసులు సంఖ్య 10 వేల మార్కును దాటింది.
ముఖ్యంగా రెండు జిల్లాల్లో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో రోజు వారి కరోనా కేసులు సంఖ్య రెండు వేల మార్కుకు చేరువ అయ్యింది. ఈ రెండు జిల్లాలతో పాటు.. తూర్పు గోదావరి, గుంటూరు, జిల్లాల్లో రోజు వారి కేసుల సంఖ్య వేయికి చేరువ అయ్యింది. దీంతో ఆయా జిల్లాల్లో లాక్ డౌన్ లేదా.. కఠిన కర్ఫ్యూను అమలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ప్రస్తుతం 44 వేల 935 యాక్టివ్ కేసులున్నాయని తాజా బులెటిన్ లో వైద్య శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల 522 మంది చనిపోయారని తెలిపింది. కరోనా కారణంగా విశాఖలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో తెలిపింది.