Public Neglected Corona Rules In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకెండ్ వేవ్ (Corona Second) భయం పూర్తిగా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 200ల లోపే నమోదు అవుతోంది. పలు జిల్లాల్లో జీరో కేసులే వస్తున్నాయి. దీంతా అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. తప్పులేదు.. కానీ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రమాదం తప్పదు.. ఎందుకంటే ఒమిక్రాన్ తరుముకోస్తోంది ప్రపంచ దేశాలను.
తెలుగు రాష్ట్రాలే కాదు.. దాదాపు ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కరోనా సెకెండ్ వేవ్ నుంచి కోలుకుంటోంది అనుకుంటే.. సడెన్ గా ఈ ఒమిక్రాన్ వేరియంట్ కలవర పెడుతోంది. ఇప్పటికైతే ఎక్కువ కేసులు రాలేదు కానీ వేగంగా వ్యాప్తి చేందే ఈ వేరియంట్ ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం ఏ మాత్రం పనికి రాదు.
అయితే చాలా వరకు కేసులు తగ్గడంతో.. ప్రజల్లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రజలు ఎక్కడా కోవిడ్ రూల్స్ పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. ఆదివారం సాధారణంగా మార్కెట్లన్నీ కిటకిటలాడుతాయి. జనం మార్కెట్లలో గుమి గూడుతారు. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకొని వెళ్లాలి.. కానీ అక్కడ ఒకరు ఇద్దరు మినహా అంతా మాస్క్ లేకుండానే తిరుగేస్తున్నారు.
భౌతిక దూరం విషయం జనాలు మరిచిపోయినట్టు ఉన్నారు. కరోనా పూర్తిగా పోలేదు.. అక్కడక్కడ కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.. స్కూల్స్ ను కరోనా భయం హడలెత్తిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో కరోనా మళ్లీ విస్తరించకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. కానీ జనంలో ఎక్కడా ఆ అవగాహన కనిపించడం లేదు.. చిన్న చిన్న అవసారల పేరుతో గుంపులు గుంపులగా మార్కెట్లలో గుమి గూడుతున్నారు.
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే.. మాస్క్ తప్పని సరి.. భౌతిక దూరం పాటించాలి.. దీనికి తోడు ఎప్పటికప్పుడు శానిటైజర్ ను చేతులకు రుద్దు కోవాల్సి ఉంది.. అసలు ఇప్పుడు చాలామంది శానిటైజర్ పేరే మరిచిపోయినట్టు ఉన్నారు. మొన్నటి వరకు శానిటైజర్ లేనిదే రోడ్డుపైకి అడుగుపెట్టేవారు కాదు.. కానీ ఇప్పుడు దాని అవసరం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు చాలా మంది.
ఇలాంటి నిర్లక్ష్యంతో ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నా.. ప్రజల్లో అవగాహన లేకున్నా.. నిర్లక్ష్యం పెరిగినా ప్రమాదం తరుముకురావడం తప్పదన్నది నిపుణుల మాట.
విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాల్లో షాపిమింగ్ మాల్ లో గంటల వ్యవధిలోనే వందలాదిగా జనం గుమి గూడుతున్నారు. అందులోనే మాస్కులు పెట్టుకున్నవారు తక్కువే కనిపిస్తున్నారు. అయితే షాపింగ్ మాల్స్ లో ఉన్న భద్రతా సిబ్బంది ఒకటి రెండు చోట్ల అభ్యంతరాలు చెబితే అప్పటికప్పుడు జేబుల్లో ఉన్న మాస్క్ తీసి తగిలించుకుంటున్నారు. కానీ స్వతహాగా దానిపై అవగాహన రావడం లేదు.