P.Anand Mohan, Visakhapatnam, News18 Corona virus: ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ కరోనా వైరస్ భయపెడుతోంది. తగ్గినట్టే తగ్గిన కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ సంఖ్య 28కి చేరింది. ముఖ్యంగా రెండు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.. అదే సమయంలో రోజు వారి కరోనా కేసులు కూడా మళ్లీ వేగంగా పెరుగుతుండడంతో కలరవపాటుకు గురి చేస్తోంది.
ప్రస్తుత కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,78,376కి చేరాయి. అదేవిధంగా కొవిడ్ బారినపడి 14,499గా మృత్యువాత పడ్డారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 102 మంది కోలుకున్నారు. కరోనా కేసులు ఓ వైపు పెరుగుతున్నా.. రికవరీలు ఎక్కువగానే ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశమే.
గత వారం రోజుల నుంచి భారీ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలోనూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా పాజిటివిటీ రేటు రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు చెబుతున్నారు. డిసెంబరు నెలలో రోజువారీ పాజిటివిటీ ఒక శాతం లోపు ఉండగా, ప్రస్తుతం అది దగ్గరదగ్గర నాలుగు శాతానికి చేరుకుంది.
ఈ గణంకాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు విశాఖలో కొవిడ్ కేసుల పెరుగుదల వేగంగా ఉందని చెప్పడానికి.
డిసెంబరులో 485 కేసులు
నమోదయ్యాయి. రోజుకు సగటున 15.7 కేసులు చొప్పున నమోదయ్యాయి. అయితే, డిసెంబరు నెలాఖరు నుంచి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. డిసెంబరు నెలలో కొవిడ్ పాజిటివిటీ రేటు 1 నుంచి 1.5 శాతం మధ్యనే ఉంది. అయితే, నెలాఖరు నుంచి భారీగా పెరుగుతోంది.