YS Jagan GoPuja: వైఎస్ జగన్ గోపూజ.. సంక్రాంతి సంబరాల్లో సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ మహోత్సవం నిర్వహించారు. టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన గోపూజ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.