ANDHRA PRADESH CM YS JAGAN MOHAN REDDY ORDERED TO CHANGE SCHOOL TIMINGS TO MORNING 9 AM AK
AP Schools Timings Change: ఏపీ పాఠశాలల పని వేళల్లో మార్పులు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
AP Schools Timings Change: ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
పాఠశాలల వేళలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. (ఫ్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ సమయం మార్పు చేశారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
3/ 7
మన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సూచించారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారన్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
6/ 7
ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం)