ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు హెలికాప్టర్లో చేరుకున్నారు. సీఎం వెంట జిల్లా ఇంచార్జి మంత్రి గౌతమ్ రెడ్డి ఇతర నేతలు కూడా ఉన్నారు. నెల్లూరు చేరుకున్నవెంటనే.. నేరుగా వరద బాధితుల దగ్గరకు చేరుకుని.. వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
వరద బాధితులతో మాట్లాడిన సీఎం జగన్ పలు హామీలు ఇచ్చారు. వరద పరిస్థితిపై అధికారులతో పూర్తిగా మాట్లాడినట్లు తెలిపారు. వరద బాధితులకు ఇంటికి రూ. 2వేలతో పాటు రేషన్ కూడా అందినట్టు అందరూ చెబుతున్నారని తెలిపారు. రానివాళ్లు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పెన్నానది నుంచి వరద నివారణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.