ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే... సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెళ్లకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.