ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ తొలిదశ అడ్మిషన్లు పూర్తైన సంగతి తెలిసిందే. ఆగస్టు 13 నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ అడ్మిషన్లు జరిగాయి. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 7
ఆన్ లైన్లో అప్లై చేసుకున్న విద్యార్థులకు రిజర్వేషన్లు, స్థానిక నిబంధనల ప్రకారం ఇంటర్ బోర్డు ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
తాజాగా రెండోదశ అడ్మిషన్లకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీవరకు సెకండ్ ఫేజ్ అడ్మిషన్లు నిర్వహిస్తామని ప్రకటించింది.
4/ 7
తొలిదశలో సీట్ల కేటాయింపుతో సంతృప్తి చెందని విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
విద్యార్థులు https://bie.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి “Online Admissions 2021-22 (APOASIS) User Manual” ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
ఓసీ, బీసీ విద్యార్థులు ఆన్ లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 చెల్లించాలని పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
విద్యార్థులు, తల్లిదండ్రులకు సందేహాలుంటే 18002749868 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని ఇంటర్ బోర్డు తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)