Ahobilam Pilgrims Rush: అహో అంటే ఒక గొప్ప ప్రశంస. బిలం అంటే బలం అని చెపుతారు. అందుకే అహోబిలం అంటే గొప్పదైన బలం అని పండితులు చెబుతారు. పురాణాల మేరకు మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్నిసంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ రూపంలోనూ అవతరించడంతోనే ఇది మహిమ గల పుణ్యక్షేత్రమని భక్తుల నమ్మకం.. అందుకే నిత్యం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ప్రస్తుతం భారీవర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. పొరుగున ఉన్న కర్నాటక నుంచి కూడా తుంగభద్ర జలాలు ఏపీ వైపు పరుగులు తీస్తున్నాయి. అందుకే అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి కనిపిస్తోంది. ఆలయం ప్రక్కనే తుంగభద్ర జలాల రాకతో జలకళ సంచరించుకుంది.
ప్రస్తుతం భక్తులతో పాటు పర్యాటకులు అధిక సంఖ్యలో పెన్నా అహోబిలంకు తరలి వస్తున్నారు. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు జలాల సవ్వడి భక్తులను ఆకట్టుకుంటోంది. తుంగభద్ర జలాలు పక్కనే ఉన్న కాల్వ ద్వారా మిడ్ పెన్నార్ జలాశయం పోతుడడంతో జలపాతాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. తుంగభద్ర డ్యాం ఇప్పటికే నిండిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది.
పెన్నా అహోబిలం వద్ద నీటి ప్రవాహం అలలు పచ్చని చెట్లు మధ్య సాగుతోంది. ఆలయం చుట్టూ ఉన్న కోనేరు లోకి, చెట్లు మొదళ్ళు క్రింద జలాలు వస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తుంగభద్ర జలాలు రాకతో జలకళ సంచరించుకుంది. ఈ ఆహ్లాదకర వాతావరణం భక్తులను బాగా ఆకట్టుకుంటోంది.