Amphex - 2023 : త్రివిధ దళాల అతిపెద్ద ద్వైవార్షిక కసరత్తు AMPHEX ఆదివారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్.. కాకినాడ సమీపంలో ఐదు రోజుల పాటు సాగిన ఈ విన్యాసాల్లో భారత సైన్యం, భారత నావికా దళానికి చెందిన యుద్ధనౌకలు, వైమానిక దళానికి చెందిన విమానాల నుంచి పెద్ద సంఖ్యలో సైనికులు పాల్గొన్నారు. విన్యాసాల్లో భాగంగా.. అన్ని రంగాలలో కష్టతరమైన ఫీట్లు చేశారు.
యుద్ధ విన్యాసాల్లో త్రివిధ దళాల మధ్య అద్భుతమైన సన్నాహక సమన్వయం కనిపించింది. 2021 జనవరిలో ముందుగా అండమాన్ నికోబార్ దీవులలో ఈ విన్యాసాలు జరిగాయి. తర్వాత ఇప్పుడు కాకినాడ సమీపంలో జనవరి 17 నుంచి జనవరి 22 వరకు కొనసాగాయి.
2/ 6
తన భూభాగాల ప్రాదేశిక సమగ్రతను రక్షించడంలో భారతదేశం యొక్క సామర్థ్యాలను చూపించడం ఈ యుద్ధ విన్యాసాల లక్ష్యం. ఇది సైన్యంలోని మూడు విభాగాల మధ్య అద్భుతమైన సమన్వయం, సంయుక్తంగా యుద్ధంలో పోరాడే సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యాన్ని కూడా కలిగి ఉంది.
3/ 6
గగనతలం నుండి మెరైన్ కమాండోల ప్రవేశం, సైన్యానికి చెందిన ప్రత్యేక దళాల వైమానిక ప్రవేశం, నావికాదళం యొక్క తుపాకీ కాల్పులు,.. భూమి, గాలి, నీటి నుంచి దళాలను ల్యాండింగ్ చేయడం, తదుపరి కార్యకలాపాలు కూడా ఈ విన్యాసాల్లో ఉన్నాయి.
4/ 6
2021 జనవరి 21 నుంచి 25 వరకు అండమాన్ నికోబార్ దీవులలో పెద్ద ఎత్తున ట్రై-సర్వీసెస్ ఉమ్మడి ఉభయచర విన్యాసాలు AMPHEX - 21ని నిర్వహించారు.
5/ 6
ఈ విన్యాసాల్లో నేవీ షిప్లు, ఉభయచర దళాలు, వివిధ రకాల వైమానిక దళ విమానాలు పాల్గొన్నాయి. (Photo - twitter)
6/ 6
పెద్ద సంఖ్యలో భారత సైన్యానికి చెందిన సైనికులు, భారత నావికాదళానికి చెందిన ఉభయచర యుద్ధ నౌకలు, భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ఈ విన్యాసాల్లో ఉమ్మడి కార్యకలాపాల్లో పాల్గొన్నాయి.