అమ్మఒడి పథకం లబ్దిదారుల సంఖ్యకు సంబంధించి ఈఏడాది తీవ్ర చర్చ జరుగుతున్నది. ఒక లక్షకుపైగా లబ్దిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు ప్రతిపక్షాలు, జగన్ వ్యతిరేక మీడియా ఆరోపిస్తుండగా, సర్కారు మాత్రం ఈ ఏడాది కొత్తగా అమ్మ ఒడి పరిథిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2019-2020 విద్యా సంవత్సరంలో తొలిసారి అమ్మ ఒడి పథకం ఆరంభంకాగా, అప్పుడు 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్లు పంపిణీ చేశారు. 2020-21 విద్యా సంవత్సరానికిగానూ 44,48,865 మంది తల్లులకు రూ.6,673 కోట్లను అందజేశారు. ఈసారి మాత్రం 43,96,402 మంది తల్లులకు రూ.6,594.60 కోట్లు అందివ్వనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఏడాది అమ్మఒడికి నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నారు. పథకం ఉద్దేశం నీరు గారకుండా, లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించిన 75 శాతం హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని పథకాన్ని వర్తింపుచేస్తున్నారు. మొత్తంగా మూడేళ్ల కాలంలో కేవలం అమ్మ ఒడి పథకానికే రూ.19,617.53కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)