శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో తిరుమల గిరులను ముస్తాబు చేశారు. ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ నెల 19(శనివారం) నుంచి 27 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రధాన గోపురంతో పాటు మాడవీధులు విద్యుద్దీపాల వెలుగు జిలుగులతో కనువిందు చేస్తున్నాయి.