హరీష్ వేమూరి, పీడీ అకిత.. ఇద్దరూ హార్వార్డ్ లా స్కూల్లో కలిశారు. మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఒకరు ఆసియా ఖండానికి చెందిన వారు, మరొకరు ఆఫ్రికా ఖండానికి చెందిన వారు. తమ పెళ్లితో.. ఇద్దరూ తమ తమ కుటుంబాల సంప్రదాయాలు, ఆచారాల్ని గౌరవించాలి అనుకున్నారు. అలాగే తమ పెళ్లి తమకు నచ్చినట్లుగా కూడా ఉండాలి అనుకున్నారు. అందుకే నాలుగుసార్లు పెళ్లి వేడుక చేసుకున్నారు.