సక్సెస్ ఫుల్ అనే మాట చాలా తక్కువమందికే వర్తిస్తుంది. అందులోనూ అనుక్షణం కష్టాలను ఎదుర్కొని.. జీవితంలో ఆటు పోటులు చూసి.. ఉన్నత స్థాయికి ఎదిగి.. తనతో పాటు మరికొంతమందికి చేయూత ఇవ్వగలిగినప్పుడే నిజమైన సక్సెస్ సాధించినట్టు.. అలాగే జీవితం, సమాజంతో ఒంటరి పోరాటం చేసిన ఓ మహిళల ఇప్పుడు విజయానికి కేరాఫ్ అయ్యింది. ఎందో అభాగ్యులకు ఆసరా కల్పిస్తోంది. తోటి మహిళలకు ఉపాధి అందిస్తోంది. బతుకు యుద్ధంలో ఒంటరిగానే పోటీ చేసి.. విజయానికి చిరునామా అయ్యింది.
కృష్ణ కుమారి బాగోగుల కోసమే తండ్రి ఫకీరయ్య మరో వివాహం చేసుకున్నాడు.. దీంతో కష్టాలు మరింత పెరిగాయి. సవతి తల్లి రూపంలో కృష్ణ కుమారి కి కష్టాలు పెరిగాయి. ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసినా.. స్కూల్ కి పంపించడానికి పిన్ని ఒప్పుకునేది కాదు. ఎదో ఒక కారణంతో నిత్యం పిన్ని చేతిలో దెబ్బలు తినవలసి వచ్చేది.
సాయంత్రం పూట పక్కింటావిడ దగ్గర టైలరింగ్ నేర్చుకున్నా. దాంతోపాటే క్యాండిల్స్ తయారీ, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, కంప్యూటర్ కూడా నేర్చుకుంది. ఆలా విరామం లేకుండా కష్టాల కడలిని నిత్యం ఈదుతూనే పదవ తరగతిని పూర్తిచేసింది. తరువాత తనకు తెలిసిన వారి ద్వారా కృష్ణా జిల్లాలోని ఆర్థిక సమతా మండలి అనే స్వచ్ఛంద సంస్థ విషయం తెలుసుకుంది.
అయితే అప్పటికి తనకు వాటి తయారీ గురించి తెలియదు. గూగుల్ సాయంతో హైదరాబాద్లోని జాతీయ జ్యూట్ బోర్డు వివరాలు తెలుసుకుని వాళ్ల సాయం తీసుకుంది. అప్పుచేసి ముడిసరకు కొన్నారు. మిషన్ కొనిస్తానంటూ ఆ సమయంలోనూ కొందరు మోసం చేశారు. చివరికి ఎలా అయితేనేం నేనే గూగుల్లో నేర్చుకుని అనుకున్న సమయానికి ఆ ఆర్డర్ని అందించగలిగింది.
మంచి క్వాలిటీ ఉండడంత వాటికి మంచి ధర ఇచ్చారు. ఆమె అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు ఇలా వివిధ సందర్భాలలో జ్యూట్ బాగ్ ల ఉపయోగాలు తెలియ చేస్తూ ఎగ్జిబిషన్స్ లో స్టాల్ల్స్ ను ఏర్పాటు చేస్తూ తమ సంస్థ ద్వారా మహిళలతో జ్యూట్ బాగ్ లు తాయారు చూపిస్తూ ప్రపంచ వ్యాప్తం గా వాటిని పంపిణి చేస్తూ ఎంతో మంది మహిళలకు సామాజికంగా, ఆర్ధికంగా అండగా ఉంటోంది.
కృష్ణ కుమారి పెద్ద అబ్బాయి సందేష్ యూకేలో ఎంబీఏ చదువుతున్నాడు. చిన్నబ్బాయి సందీప్ పాలిటెక్నిక్ చదువుకుంటూ అమ్మకు సాయంగా ఉంటున్నాడు. కృష్ణ కుమారి లో ఉన్న వ్యాపారవేత్తను గుర్తించిన ఎన్నో సంస్థలు ఆమెను అవార్డుల తో సత్కరించాయి. అంతే కాకుండా ఎన్నో విద్యాసంస్తలు భావితరాల వారికీ కృష్ణ కుమారి పోరాటపటిమను తెలియచేసేందుకు అతిధిగా పిలుస్తునారు.