తాజాగా విజయవాడ (Vijayawada) ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికిరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు మరో 25 మంది జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యులకు వైరస్ సోకింది. పలువురు పారామెడికల్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. ఇంతమంది వైద్యులు ఒకేసారి కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో మిగిలిన వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో 50 మందికి విద్యార్థులకు కొవిడ్ సోకింది. వీరిని కాలేజీలోని ఐసోలేషన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐతే మంగళవారం నుంచి ఎంబీబీఎస్ పరీక్షలుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన అధికారులు స్టూడెంట్స్ కోలుకున్న తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం. (ప్రతీకాత్మకచిత్రం)
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్కూళ్లకు సెలవులివ్వాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సినేనష్ వేగంగా సాగుతున్నందున సెలవులివ్వాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. స్కూళ్లు కొనసాగించడమే కాకుండా.. మార్చి నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరతామన్నారు. (ఫైల్)