విజయవాడ (Vijayawada) లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వన్ టౌన్ ప్రాంతానికి చెందిన మహిళకు గతంలోనే పెళ్లైంది. ఆమెకు ఒక కుమరుడు కుమారుడు, 9వ తరగతి చదివే కుమార్తె ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా విడాకులిచ్చింది. అప్పటికే భార్యతో విడిపోయిన వ్యక్తిని కొన్నేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకుంది. పిల్లలు, రెండో భర్త అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే టీనేజ్ బాలికపై కన్నేసిన సవతి తండ్రి.. వావి వరసలు మరిచి.. ఆమె స్నానం చేస్తుండగా బాత్ రూమ్ లో ఫోన్ పెట్టి సీక్రెట్ గా వీడియో తీశాడు. ఈ క్రమంలో తర్వాతి రోజు ఉదయం.. మహిళ.. తన భర్త ఫోన్ తీసి చూస్తుండగా.. కూతురు స్నానం చేస్తున్న వీడియోలు కనిపించాయి. దీంతో ఆమె భర్తతో గొడవపడింది. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే తనపై కేసు పెట్టిన భార్యను నిందితుడు బెదిరిస్తున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మకచిత్రం)