iQOO Z6 5G: బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న ఫోన్ iQOO Z6 5G. దీని అసలు ధర రూ.19,990గా ఉంది. కానీ ప్రస్తుత ఆఫర్లో భాగంగా, ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 14,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది మీకు 25 శాతం తగ్గింపును ఇస్తుంది. మీరు ఈ ఆఫర్‌ని సరిగ్గా ఉపయోగించుకుంటే, మీకు రూ. 4,991 అదా అవుతుంది.
Redmi Note 11T 5G: రెడ్ మీ లవర్స్ చాలా మంది ఉంటారు. దీనిలో ప్రస్తుతం బడ్జెట్ ధరలోనే స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగానే Redmi Note 11T 5G బెస్ట్ ఫొన్ అని చెప్పవచ్చు. దీని అసలు ధర రూ. 20,999 ఉంది. ఇప్పుడు ఇది కేవలం రూ. 17,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లో మీకు 14 శాతం తగ్గింపును ఇస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటే.. రూ. 3,000 మీరు ఆదా చేయవచ్చు.
Infinix Zero 5G: ఇండియాలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న కంపెనీల్లో Infinix కూడా ఒకటి. దీనిలో కూడా 5G మోడల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగా.. Infinix Zero 5G స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 24,999 ఉంది. ఇప్పుడు ఇది కేవలం రూ. 19,550 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Realme Narzo 50 Pro 5G: అత్యుత్తమ ఆల్ రౌండర్ జాబితాలో నార్జో 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మోడల్ ఒకటి. దీని అసలు ధర రూ. 25,999 ఉంది. ఇది మీకు 23 శాతం తగ్గింపును ఇస్తుంది. ఈ ఆఫర్ ద్వారా రూ. 6,000 ఆదా చేయవచ్చు. అంటే ఈ ఫోన్ ను రూ.20 వేలల్లో కొనుగోలు చేయవచ్చు.
Poco X3 Pro: ఈ స్మార్ట్ ఫోన్ అస్సలు ధర రూ.23,999గా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేటుతో మరియు గొరిల్లా గ్లాస్ 6 ని సేఫ్టితో అందిస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.96GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 640 GPU తో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజన్ లో రూ.18,999లకు అందుబాటులో ఉంది.
Xiaomi Redmi Note 10 Pro Max : ఈ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 6.67 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డాట్ డిస్ప్లే తో ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా MIUI 12 స్కిన్ పైన నడుస్తుంది. 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో.. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.22,999గా ఉంది. ప్రస్తుతం ఆఫర్ ధరతో రూ.19,999గా ఉంది.
Realme Narzo 30 Pro : రియల్మీ నార్జో 30 ప్రో 6.5 ఇంచ్ ఫుల్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ప్రాసెసర్ మీడియా టెక్ హీలియో 800U SoC తో పనిచేస్తుంది. 5,000 mAh బ్యాటరీతో.. 30W ఫాస్ట్ ఛార్జ్ సపోర్టుతో ఉంటుంది. దీని అస్సలు ధర రూ.17,999 గా ఉంది. రూ.వెయ్యి ఆఫర్ తో ఈ ఫోన్ రూ.16,999లకు వస్తుంది.
Vivo V20 SE: ఈ ఫోన్ 6.44-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ మరియు స్క్రీన్‌లో వేలిముద్ర సెన్సార్‌తో AMOLED స్క్రీన్ తో అలరిస్తుంది. V20 SE ను ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 610 GPU తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ కలిగి ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.22వేలు ఉండగా.. ఆఫర్ లో ఈ ఫోన్ రూ.19,000 అమెజాన్ లో అందుబాటులో ఉంది.