అందుబాటు ధరలో అదిరే కెమెరా ఫీచర్‌తో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తే.. మీకు ఒప్పొ ఎఫ్21 ప్రో అనువుగా ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 19,990గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఇందులో 64 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా వ్యవస్థ ఉంది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఇంకా ఈ ఫోన్లో 6.43 ఇంచుల డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ కలిగి ఉంది.
పోకో ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా అదరగొట్టేస్తోంది. ఈ ఫోన్లో 695 5జీ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్లో 6.67 ఇంచుల స్క్రీన్, అమొలెడ్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 15,999. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
రియల్‌మి 9 5జీ ఫోన్ కూడా అందుబాటు ధరలోనే ఉంది. ఈ ఫోన్లో 64 జీబీ మెమరీ వేరియంట్ రేటు రూ. 15,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొనొచ్చు. ఇందులో మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంది. 48 ఎంపీ కెమెరా ట్రిపుల్ రియర్ కెమెరా వ్యవస్థ ఉంటుంది.
అలాగే మోటరోలా ఫోన్ కూడా సూపర్‌గా ఉంది. జీ62 5జీ ఫోన్లో స్టాక్ అండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 5జీ ఫోన్ ఇది. 6.5 ఇంచుల డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇంకా రెడ్మి నోట్ 11 ప్రో ఫోన్లో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రేటు రూ. 17,999గా ఉంది. ఇందులో ఏకంగా 108 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇంకా ఇందులో 6.67 ఇంచుల స్క్రీన్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఐకూ జెడ్6 లైట్ 5జీ ఫోన్ కూడా అదిరింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ రేటు రూ. 14,499గా ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 1 ప్రాసెసర్, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ ఫోన్ కూడా బాగుంది. దీని రేటు రూ. 19,999. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరా, 6.59 ఇంచుల డిస్ప్లే, 64 ఎంపీ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.