Venkatesh | టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వెంకటేష్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఒకవైపు యాక్షన్ చిత్రాల్లో నటిస్తూనే ఫ్యామిలీ చిత్రాలను చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక సీనియర్ టాప్ హీరోల్లో ఈయనకు మాత్రమే ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ చేసారు. తాజాగా తన అబ్బాయితో మల్టీస్టారర్ మూవీ చేయకపోయినా.. రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేసాడు. వీళ్లిద్దరు ఒక స్క్రీన్ పై చూడాలనుకునే అభిమానులకు కిక్ ఇచ్చారు.
గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. గతేడాది యువ హీరో విశ్వక్సేన్తో ‘ఓరి దేవుడా’ సినిమా చేసాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. (Twitter/Photo)
F2లో వరుణ్ తేజ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్. ఇపుడు మరోసారి F3లో మరోసారి కలిసి పలకరించారు. సినిమాను మరింత కామెడీ ఎంటర్టేనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. (Twitter/Photo)
మరోవైపు వెంకటేష్.. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో పూజా హెగ్డే అన్న పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక ‘అనారీ’, ‘తక్దీర్వాలా’ తర్వాత వెంకటేష్ యాక్ట్ చేస్తోన్నమూడో హిందీ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమా ఈ ఇయర్ ఈద్ పండగ రోజున విడుదల కానుంది. (Twitter/Photo)
ఇక వెంకీ నటించిన ‘చింతకాయల రవి’లో ఎన్టీఆర్ ఓ పాటలో అతిథి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే కదా. ఇక వీళ్లిద్దరు కలిసి నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. (Facebook/Photo)
‘ప్రేమమ్’ తర్వాత పూర్తిస్థాయిలో నాగచైతన్యతో వెంకటేష్ చేసిన మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. (Twitter/Photo)
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.ఈ సినిమాలో అన్నదమ్ములుగా వెంకటేష్, మహేష్ బాబు నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Facebook/Photo)
‘అజ్ఞాతవాసి’లో అతిథి పాత్రలో మెరిసిన వెంకీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ కాసేపు మెరిసారు. ఈ సినిమా విడుదలపుడు కాకుండా.. ఆ తర్వాత యాడ్ చేసారు. త్వరలో వెంకటేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. (Facebook/Photo)