ఒకప్పుడు తెలుగు హీరోలు ఒక్కో సినిమాకు రూ. 12 కోట్లు నుంచి రూ. 15 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటేనే.. అమ్మో అనుకునేవాళ్లు. కానీ రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ ఆకాశమంత పెరిగింది. మన సినిమాలు బాలీవుడ్‌లోనూ సత్తా చూపిస్తున్నాయి. (Twitter/Photo)
దాంతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొచ్చేయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. Photo : Twitter
ప్రభాస్ నుంచి మొదలు పెట్టి పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది పారితోషికం ఇప్పుడు రూ. 50 కోట్లు దాటేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు హీరోలు కూడా ఈ మార్క్‌కు చేరువగా వస్తున్నారు. అసలు మన హీరోలు ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు.. ఎవరి రేంజ్ ఎంత అనేది ఓ సారి చూద్దాం.. Photo : Twitter
1. ప్రభాస్: ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తాజాగా 25వ సినిమా స్పిరిట్ కోసం రూ. 150 కోట్ల వరకు అందుకుంటున్నారని ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్‌తో పాటు ప్రాజెక్ట్ కే, స్పిరిట్, సలార్‌లతో పాటు రాజా డీలక్స్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. Photo : Twitter
2. పవన్ కళ్యాణ్: పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లుకు 60 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మిగిలిన సినిమాలకు కూడా 50 కోట్లు అందుకుంటున్నారట పవన్. Photo : Twitter
3. మహేష్ బాబు: సర్కారు వారి పాట సినిమాకు గానూ మహేష్ బాబు 55 కోట్లు తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఆ ఆ తర్వాత రాజమౌళితో సినిమా ఉండనుంది. Photo : Twitter
4. జూనియర్ ఎన్టీఆర్: ట్రిపుల్ ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు రూ. 45 కోట్లకు పైగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. మూడేళ్లు డేట్స్ ఇచ్చారు కాబట్టి అంత తీసుకున్నారని టాక్.. కొరటాల కోసం రూ. 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట తారక్. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతుంది. Photo : Twitter
5. రామ్ చరణ్: ఈయన కూడా రూ. 45 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.. శంకర్ సినిమా కోసం రూ. 60 కోట్ల వరకు అందుకుంటున్నాడని సమాచారం.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్గా న్యూజిలాండ్ షెడ్యూల్ కూడా కంప్లీటైంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ .. బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయనున్నారు. Photo : Twitter
6. చిరంజీవి: ఆచార్యకు రామ్ చరణ్ నిర్మాత కాబట్టి చిరు రెమ్యునరేషన్ లెక్కలు తేలడం లేదు.. కానీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఆయన రూ. 50 కోట్ల వరకు అందుకుంటున్నారని అంటున్నారు.. రీసెంట్గా గాడ్ ఫాదర్ సినిమాతో పలకరించారు. ఆ తర్వాత భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాలతో పలకరించనున్నారు.
7. అల్లు అర్జున్: పుష్ప 2కు రూ. 60 కోట్లకు పైగానే అల్లు అర్జున్ పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సుకుమార్ దర్శకుడు. Photo : Twitter
8. బాలకృష్ణ: అఖండ కోసం బాలయ్య రూ. 11 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా రూ. 90 కోట్లు షేర్ వసూలు చేసిన నేపథ్యంలో రూ. 15 వరకు పారితోషికం పెంచినట్లు తెలుస్తుంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను జనవరి 12న విడుదల కానుంది. Photo : Twitter
9. నాగార్జున: నాగార్జున కూడా ఒక్కో సినిమాకు రూ. 7 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్.. ఆ మధ్య విడుదలైన బంగార్రాజు సినిమా రూ. 40 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. రీసెంట్గా నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా సరైన ఫలితాన్ని అందుకోలేదు. Photo : Twitter
10. వెంకటేష్: ఒక్కో సినిమాకు రూ. 7 కోట్లు వరకు పుచ్చుకుంటున్నారని అప్పట్లో అన్నారు. అయితే వెంకటేష్. వెంకటేష్ ఎఫ్ 3 కోసం రూ 15 కోట్ల వరకు తీసుకున్నట్టు టాక్. (Twitter/Photo)
11. విజయ్ దేవరకొండ: వరస ఫ్లాపులు వస్తున్నా విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం..రీసెంట్గా లైగర్ సినిమాకు రూ. 15 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. Photo : Twitter
12. నాని: వరస ఫ్లాపుల కారణంగా నాని రేంజ్ కాస్త తగ్గింది.. ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వార్తలున్నాయి.. అయితే శ్యామ్ సింగరాయ్ తర్వాత మళ్లీ రూ. 10 కోట్లకు చేరుకున్నాడు నాని. నాని దసరా అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. Photo : Twitter
13. రవితేజ: క్రాక్ తర్వాత రవితేజ రెమ్యునరేషన్ పెరిగింది.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ కోసం రూ. 13 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్.. రాబోయే ధమాకా, టైగర్ నాగేశ్వరరావు సినిమాల కోసం రూ. 15 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తుంది అటు వాల్తేరు వీరయ్య కోసం మూడు రోజులు షూటింగ్ కోసం రూ. 10 కోట్లు తీసుకున్నట్టు సమాచారం.. Photo : Twitter
14. వరుణ్ తేజ్: వరుణ్ తేజ్ పారితోషికం కూడా రూ. 8 కోట్ల వరకు ఉందని టాక్.. ఇక ఆయన తాజా సినిమా గని డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఎఫ్ 3 మూవీతో తిరిగి బ్యాక్ బౌన్స్ అయ్యారు వరుణ్ తేజ్. Photo : Twitter
15. శర్వానంద్: ఇన్ని ఫ్లాపులు వచ్చినా శర్వానంద్ ఒక్కో సినిమాకు రూ.4 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా ఒకే ఒక జీవితంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. Photo : Twitter
16. నితిన్: ఈ మధ్య వరస ఫ్లాపులతో బాగా డీలా పడిపోయాడు నితిన్. భీష్మ లాంటి సూపర్ హిట్ తర్వాత నితిన్ నటించిన చెక్, రంగ్ దే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓటిటిలో విడుదలైన మాస్ట్రో పర్లేదనిపించింది. అటు మాచర్ల నియోజకవర్గం సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం నితిన్ చేతిలో మరో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఇందులో ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకు తీసుకుంటున్నారట నితిన్. Photo : Twitter
17. నాగ చైతన్య: ఈ మధ్య చైతూ వరస విజయాలు అందుకుంటున్నాడు. దాంతో రెమ్యునరేషన్ కూడా పెరిగింది. లవ్ స్టోరీ కరోనా కాలంలోనూ రూ. 36 కోట్లు వసూలు చేసింది. మొన్న బంగార్రాజు కూడా బాగానే ఆడింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు రూ. 6 కోట్లకు పైగానే అందుకుంటున్నారట చైతూ. కానీ రీసెంట్గా ఈయన నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాతో భారీ డిజాస్టర్‌ను అందుకున్నాడు. Photo : Twitter
18. గోపీచంద్: కొన్నేళ్లుగా సరైన విజయం లేకపోయినా కూడా అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటున్నారు గోపీచంద్. ఈయన సినిమాకు 5 కోట్ల వరకు అందుకుంటున్నారట. రీసెంట్గా పక్కా కమర్షియల్ సినిమా కూడా గోపీచంద్‌కు సరైన హిట్ దక్కలేదు. రాబోయే శ్రీవాస్ సినిమాపైనే గోపీచంద్ ఆశలు పెట్టుకున్నాడు. . Photo : Twitter
19. రామ్ పోతినేని: ఇస్మార్ట్ శంకర్, రెడ్ లాంటి సినిమాలతో ఫామ్‌లోకి వచ్చిన రామ్.. కానీ ఆ తర్వాత వచ్చిన ‘ది వారియర్’ కోసం రూ. 8 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. ఇక బోయపాటితో కమిటైన పాన్ ఇండియన్ సినిమాకు రూ. 10 కోట్ల వరకు అందుకోబోతున్నాడు రామ్. Photo : Twitter
20. సాయి ధరమ్ తేజ్: యాక్సిడెంట్ తర్వాత సినిమాలకు దూరంగానే ఉన్నారు సాయి తేజ్. అయితే దానికి ముందు ఒక్కో సినిమాకు రూ. 6 కోట్ల వరకు అందుకున్నారట. ఇప్పుడు కూడా ఇదే రెమ్యునరేషన్ ఉండొచ్చని అంటున్నారు. Photo : Twitter