ఒకప్పుడు తెలుగులో సీక్వెల్స్ తీయాలంటే భయపడేవారు. ఎందుకంటే గతంలో తీసిన సీక్వెల్స్‌కు పెద్దగా ఆదరణ పొందలేదు. అయితే బాహుబలి ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో 2023లో తెలుగులో విడుదల కానున్న సీక్వెల్స్ ఏంటో ఓసారి చూద్దాం..
పొన్నియన్ సెల్వన్ 2 : Ponniyin Selvan 2 : విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్ -1. ఈ సినిమాకు కూడా సీక్వెల్ కూడా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 2023లో విడుదలకానుంది. Photo : Twitter
గూఢచారి 2 : Goodachari 2 : అడివి శేష్ హీరోగా వచ్చిన ఈసినిమా 2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శోభిత ధూళిపాల హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా 2023లో రిలీజ్ కానుందని అంటున్నారు. Photo : Twitter
రాక్షసుడు 2 : Rakshasudu 2 : బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. తమిళ ‘రాట్ససన్’ కు తెలుగు రీమేక్‌గా వచ్చింది. Photo : Twitter
బింబిసార 2 : Bimbisara 2 : నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘బింబిసార’. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా బింబిసార 2 వస్తోంది. ఈ సినిమా కూడా 2023లోనే విడుదలకానుందని సమాచారం. Photo : Twitter
ఎఫ్ 4 : F4 : వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఎఫ్ 2’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ‘ఎఫ్ 4’ కూడా రానుంది. ఈ సినిమా 2023లో విడుదలకానుందని టాక్. Photo : Twitter
డీజే టిల్లు 2 : DJ Tillu 2 : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’ మంచి విజయాన్ని అందుకుంది. సితార బ్యానర్లో వచ్చిన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపోందుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో మడోన్న సెబాస్టియన్ నటిస్తోంది. ఈ సినిమా 2023లో విడుదలకానుంది. Photo : Twitter
2 : Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. పుష్ప ది రైజ్ అనే పేరుతో రానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో మందన్న నటిస్తోంది. ఈ సినిమా 2023 లో ఈ మూవీ విడుదలకానుంది. Photo : Twitter