ఒకప్పుడు తెలుగు హీరోలు ఒక్కో సినిమాకు 12 కోట్లు నుంచి 15 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటేనే.. అమ్మో అనుకునేవాళ్లు. కానీ రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ ఆకాశమంత పెరిగింది. మన సినిమాలు బాలీవుడ్‌లోనూ సత్తా చూపిస్తున్నాయి. దాంతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. Photo : Twitter
ప్రభాస్ నుంచి మొదలు పెట్టి పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది పారితోషికం ఇప్పుడు 50 కోట్లు దాటేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు హీరోలు కూడా ఈ మార్క్‌కు చేరువగా వస్తున్నారు. అసలు మన హీరోలు ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు.. ఎవరి రేంజ్ ఎంత అనేది ఓ సారి చూద్దాం.. Photo : Twitter
1. ప్రభాస్: ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తాజాగా 25వ సినిమా స్పిరిట్ కోసం 150 కోట్ల వరకు అందుకుంటున్నారని ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్‌తో పాటు ప్రాజెక్ట్ కే, స్పిరిట్, సలార్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. Photo : Twitter
2. పవన్ కళ్యాణ్: పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లుకు 60 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మిగిలిన సినిమాలకు కూడా 50 కోట్లు అందుకుంటున్నారట పవన్. Photo : Twitter
3. మహేష్ బాబు: సర్కారు వారి పాట సినిమాకు గానూ మహేష్ బాబు 55 కోట్లు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.. పైగా ఈ సినిమాకు ఈయన నిర్మాణంలో భాగం కూడా.. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఆ ఆ తర్వాత రాజమౌళితో సినిమా ఉండనుంది. Photo : Twitter
4. జూనియర్ ఎన్టీఆర్: ట్రిపుల్ ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు 45 కోట్లకు పైగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. మూడేళ్లు డేట్స్ ఇచ్చారు కాబట్టి అంత తీసుకున్నారని టాక్.. కొరటాల కోసం 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట తారక్. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్లో రూపోందనుంది. Photo : Twitter
5. రామ్ చరణ్: ఈయన కూడా 45 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.. శంకర్ సినిమా కోసం 60 కోట్ల వరకు అందుకుంటున్నాడని సమాచారం.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయనున్నారు. Photo : Twitter
6. చిరంజీవి: ఆచార్యకు రామ్ చరణ్ నిర్మాత కాబట్టి చిరు రెమ్యునరేషన్ లెక్కలు తేలడం లేదు.. కానీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఆయన 50 కోట్ల వరకు అందుకుంటున్నారని అంటున్నారు.. వాల్తేర్ వీరయ్య హిట్ తర్వాత చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. Photo : Twitter
7. అల్లు అర్జున్: పుష్ప 2కు 60 కోట్లకు పైగానే అల్లు అర్జున్ పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో ఉంది. సుకుమార్ దర్శకుడు. రష్మిక మందన్న హీరోయిన్గా చేస్తోంది. Photo : Twitter
8. బాలకృష్ణ: అఖండ కోసం బాలయ్య 11 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా 70 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో వీరసింహారెడ్డికి 15 కోట్ల వరకు పారితోషికం పెంచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నారు. Photo : Twitter
9. నాగార్జున: నాగార్జున కూడా ఒక్కో సినిమాకు 7 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్.. ఆ మధ్య విడుదలైన బంగార్రాజు సినిమా 40 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత నాగార్జున ఘోస్ట్ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. Photo : Twitter
10. వెంకటేష్: ఒక్కో సినిమాకు 7 కోట్లు వరకు పుచ్చుకుంటున్నారని అప్పట్లో అన్నారు. అయితే వెంకటేష్. వెంకటేష్ ఎఫ్ 3 కోసం 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడిచింది. వెంకటేష్ ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఇక ఆయన ప్రస్తుతం యువ దర్శకుడు శైలేష్ కొలను డైెరెక్షన్లో సైంధవ్ అనే సినిమా చేస్తున్నారు. Photo : Twitter