మహేష్ బాబు నటుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన మహేష్ బాబు.. నటుడిగా 43 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్నారు.ఇక హీరోగా 23 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇక కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈయన.. ఈ జనరేషన్లో ఎవరు అందుకోని ఓ రికార్డు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. (Mahesh Babu)
మహేష్ బాబుకు యూఎస్ మార్కెట్లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాల్లో మహేష్ బాబు దరిదాపుల్లో ఎవరు లేరు. ఈయన సినిమాలు యూఎస్‌లో 1 మిలియన్ డాలర్స్ అందుకున్న 'సినిమాలు 10కి పైగా ఉన్నాయి. అమెరికా బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన మహేష్ బాబు చిత్రాల విషయానికొస్తే..
సర్కారు వారి పాట | సర్కారు వారి పాట 1 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసింది. ఈ సినిమాతో మరోసారి యూఎస్ తెలుగు ప్రేక్షకుల్లో మహేష్ బాబుకున్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏంటో అర్థమవుతోంది. టాలీవుడ్లో 1 మిలియన్ యూఎస్ డాలర్ వసూళ్లు చేసిన హీరోల్లో మహేష్ బాబుదే అగ్రస్థానం. గతేడాది సర్కారు వారి పాట సినిమా యూఎస్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రాల్లో 11వ కావడం విశేషం. . ( Photo : Twitter)
’సర్కారు వారి పాట’ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్కడ మహేష్ బాబుకు ఇది నాలుగో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక దక్షిణాది నుంచి యూఎస్ మార్కెట్లో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న నాల్గో దక్షిణాది హీరోగా నిలిచారు. ఈయన కంటే ముందు రజినీకాంత్, సినిమాలు నాలుగు అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేశాయి.(Twitter/Photo)
‘సర్కారు వారి పాట’ కంటే ముందు మహేష్ బాబు హీరోగా నటించిన ’శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ డాలర్స్ మార్క్‌ను అందుకున్నాయి. మొత్తంగా ’సర్కారు వారి పాట’ మూవీతో మహేష్ బాబు సంచలనాలకు వేదికగా నిలిచారు.(Twitter/Photo)
మరోవైపు ఈయన హీరోగా నటించిన 27 చిత్రాల్లో 11 చిత్రాలు యూఎస్ మార్కెట్లో 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసాయి. ఈ రకంగా యూఎస్ మార్కెట్లో అత్యధిక 1 మిలియన్ డాలర్స్ అందుకున్న హీరోగా మహేష్ బాబు రికార్డు క్రియేట్ చేసాడు. అందులో 9 చిత్రాలు వరుసగా అమెరికా బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ వసూళు చేయడం అంటే మాములు విషయం కాదు. అక్కడ మహేష్ బాబు 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల విషయానికొస్తే..
1.దూకుడు.. మహేష్ బాబు సినీ కెరీర్లో టాలీవుడ్ సినిమాల్లో యూఎస్ మార్కెట్లో 1 మిలియన్ యూఎస్ డాలర్స్ సాధించిన సినిమాగా దూకుడు రికార్డులను తిరగరాసింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 14 రీల్స్ పతాకంపై తెరకెక్కింది. అంతేకాదు అమెరికాలో తొలి 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. (Mahesh babu in Dookudu Photo : Twitter)
2. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. మహేష్ బాబు సీనియర్ హీరో వెంకటేష్ కలిసి నటించిన మూవీ ’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది. (Twitter/Photo)
3. నేనొక్కడినే.. 1 సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ నేనొక్కడినే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైనా.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేయడం విశేషం. (Twitter/Photo)
4. ఆగడు.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రెండోసారి హీరోగా నటించిన మూవీ ‘ఆగడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైంది. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేయడం విశేషం. (Twitter/Photo)
5. శ్రీమంతుడు.. కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ’శ్రీమంతుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా అమెరికా బాక్సాఫీస్ దగ్గర 2.8 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. (Twitter/Photo)
6. బ్రహ్మోత్సవం.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి హీరోగా నటించిన మూవీ ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయడం విశేషం. (Twitter/Photo)
7.స్పెడర్.. మహేష్ బాబు హీరోగా ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘స్పైడర్’. ఈ సినిమా మహేష్ బాబు తొలి బై లింగ్వల్ మూవీ. డిజాస్టర్ టాక్‌తో కూడా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. (Twitter/Photo)
8. భరత్ అను నేను.. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన రెండో చిత్రం ‘భరత్ అను నేను. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి అమెరికాలో మహేష్ బాబు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (Twitter/Photo)
9.మహర్షి.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మహర్షి’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా యూఎస్ మార్కెట్లో 1 మిలియన్ పైగా యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. (Twitter/Photo)
10. సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీష్ దగ్గర 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. (Twitter/Photo)
11. సర్కారు వారి పాట.. టాలీవుడ్లో 1 మిలియన్ యూఎస్ డాలర్ వసూళ్లు చేసిన హీరోల్లో మహేష్ బాబుదే అగ్రస్థానం. ఇక సర్కారు వారి పాట సినిమా యూఎస్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రాల్లో 11వ కావడం విశేషం. అక్కడ మహేష్ బాబుకు ఇది నాలుగో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక దక్షిణాది నుంచి యూఎస్ మార్కెట్లో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న నాల్గో దక్షిణాది హీరోగా నిలిచారు. ఈయన కంటే ముందు రజినీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు నాలుగు అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేశాయి. (Twitter/Photo)
‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన ’శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ డాలర్స్ మార్క్‌ను అందుకున్నాయి.